తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చెప్పేవి 'స్వదేశీ' మాటలు.. దింపేవి చైనా వస్తువులు'

కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి కేంద్రం ఓవైపు విశేష ప్రచారం కల్పిస్తోందని.. మరోవైపు ఇందుకు భిన్నంగా చైనా నుంచి ఎక్కువగా దిగుమతులు చేస్తోందని ఆరోపించారు.

rahul
'చెప్పేవి 'భారత్​లో తయారీ' డైలాగులు.. దింపేవి చైనా వస్తువులు'

By

Published : Jun 30, 2020, 2:09 PM IST

చైనా నుంచి దిగుమతులు పెరగడంపై కేంద్రం లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కేంద్రం మేక్ ఇన్ ఇండియా అని చెబుతోందని.. కానీ చైనా నుంచి వస్తువులను దిగుమతి చేస్తోందని దుయ్యబట్టారు.

"వాస్తవాలు అబద్ధమాడవు. భాజపా మేక్ ఇన్ ఇండియా అని చెబుతోంది. కానీ చైనా నుంచి దిగుమతి చేస్తోంది."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

దీనికి ఆధారంగా చైనా నుంచి యూపీఏ హయాంలో, ఎన్​డీఏ ప్రభుత్వంలో దిగుమతి చేసుకున్న వస్తువులను పోలుస్తూ ఓ బార్​గ్రాఫ్​ను ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు రాహుల్. ప్రస్తుత ఎన్​డీఏ కాలంలో చైనా నుంచి దిగుమతులు పెరిగినట్లుగా ఈ చిత్రం చూపిస్తోంది.

రాహుల్ గాంధీ ట్వీట్

తూర్పు లద్దాఖ్​ గల్వాన్​ లోయలో సరిహద్దు ఘర్షణ జరిగిన నాటి నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు రాహుల్. మేక్ ఇన్ ఇండియా ఓ విఫల కార్యక్రమమని విమర్శిస్తూ వస్తున్నారు.

ఇదీ చూడండి:'ఆ వార్తలు అసత్యం- అమిత్ షా ట్వీట్ ఫేక్​'

ABOUT THE AUTHOR

...view details