తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అప్పుడు ప్రలోభాలు.. ఇప్పుడు కక్ష సాధింపులు' - భాజపా

కర్ణాటక సీఎం కుమారస్వామికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున లంచం ఇవ్వజూపిందని మాజీ ప్రధాని, జేడీఎస్​ దళపతి హెచ్​డీ దేవెగౌడ ఆరోపించారు. భాజపా ప్రలోభాలకు జేడీఎస్​ లొంగలేదనే ఐటీ దాడులు చేస్తున్నారని విమర్శించారు.

"ప్రలోభాలకు లొంగలేదనే.. ఐటీ దాడులు"

By

Published : Mar 29, 2019, 7:00 AM IST

ప్రలోభాలకు లొంగలేదనే.. ఐటీ దాడులు: దేవెగౌడ
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మాజీ ప్రధాని, జేడీఎస్​ దళపతి హెచ్​డీ దేవెగౌడ మండిపడ్డారు. కర్ణాటక వ్యాప్తంగా జేడీఎస్​ నాయకులపై జరుగుతోన్న ఐటీ దాడులను కక్షపూరిత చర్యగా అభివర్ణించారు.

ఎన్నికల ముందు, తర్వాత భాజపాతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ కుమారస్వామికి పెద్ద మొత్తంలో లంచం ఎరజూపారని దేవెగౌడ ఆరోపించారు. ఎలాంటి ప్రలోభాలకు జేడీఎస్​ లొంగలేదనే... చివరి అస్త్రంగా కేంద్రం ఐటీ దాడులు చేస్తోందని చెప్పారు.

"కుమరస్వామిని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు. భాజపా మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల ముందు ఒత్తిడి తెచ్చారు. జేడీఎస్​ ఎన్నికల ఖర్చు కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఎర చూపారు. కుమారస్వామిని ముంబయి రమ్మన్నారు. అక్కడే డబ్బు ఉంది. ఇన్ని ప్రలోభాలకు లొంగకుండా కుమారస్వామి భాజపాతో పొత్తును ఎన్నికల ముందు, తర్వాత తిరస్కరించారు. ఇంతలా దిగజారిన కేంద్ర ప్రభుత్వాన్ని నేనెన్నడూ చూడలేదు."
- హెచ్​డీ దేవెగౌడ, మాజీ ప్రధాని

భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​ షా తనను కలవడానికి ప్రయత్నించారని దేవగౌడ తెలిపారు. అయితే తాను ససేమీరా ఒప్పుకోలేదన్నారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఇంతలా దిగజారిన కేంద్రప్రభుత్వాన్ని చూడలేదని ఆరోపించారు. మోదీ ఎన్నికల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో ప్రజలకు లెక్క చెప్పాలని దేవెగౌడ డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details