తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటక స్పీకర్​పై 'అవిశ్వాసం' యోచనలో భాజపా - భాజపా

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్​ను మార్చాలని భావిస్తోంది నూతనంగా అధికారంలోకి వచ్చిన భాజపా. రమేశ్​ కుమార్​ రాజీనామా చేసి తప్పుకోకపోతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో ఉంది.

కర్ణాటక స్పీకర్​పై 'అవిశ్వాసం' యోచనలో భాజపా

By

Published : Jul 27, 2019, 4:20 PM IST

కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన ఒక్క రోజులోనే స్పీకర్​ను మార్చే యోచనలో పడింది భాజపా. రాజీనామా చేసి స్వయంగా సభాపతి పదవి నుంచి తప్పుకోవాలని రమేశ్ కుమార్​కు సూచనప్రాయంగా తెలిపారు కమలదళ నేతలు. ఒకవేళ స్పీకర్​ రాజీనామా చేయకపోతే ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.

"సాధారణంగా అధికార పార్టీ నేతలు సభాపతిగా వ్యవహరిస్తారు. ఆ పదవిలో ప్రతిపక్షనేత ఎలా ఉంటారు" అని ప్రశ్నించారు ఓ భాజపా నేత. ముందు తమ ప్రభుత్వం సభలో విశ్వాసం నిరూపించుకుని, ఆ వెంటనే ఆర్థిక బిల్లును ఆమోదిస్తామని తెలిపారు. ఆ తర్వాత స్పీకర్​ వైదొలగకపోతే ఆయనపై విశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని చెప్పారు.

నాటకీయ​ పరిణామాల మధ్య కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు బీఎస్​ యడియూరప్ప.
ముగ్గురు అసంతృప్త ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు స్పీకర్​ రమేశ్ కుమార్. మిగతా ఎమ్మెల్యేలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details