తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పరువు కోసం'.. కోర్టు ఆవరణలోనే దాడి..! - పరువు కోసం

ఉత్తర్​ప్రదేశ్​ భాజపా ఎమ్మెల్యే రాజేశ్​ మిశ్రా కూతురు సాక్షి భర్త అజితేశ్​ కుమార్​పై కోర్టు ఆవరణలోనే దాడి జరిగింది. వారిరువురికీ రక్షణ కల్పించాలని అలహాబాద్​ కోర్టు ఆదేశించిన కొద్ది నిమిషాలకే దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.

'పరువు కోసం'.. కోర్టు ఆవరణలోనే దాడి..!

By

Published : Jul 15, 2019, 9:13 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ భాజపా ఎమ్మెల్యే రాజేశ్​ మిశ్రా కూతురు సాక్షి దంపతులకు ప్రత్యేక రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది అలహాబాద్​ హైకోర్టు. వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు తన తండ్రి నుంచి ముప్పు ఉందని సాక్షి.. ఇటీవల కోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. నేడు న్యాయస్థానం ఎదుట హాజరైన సాక్షి, ఆమె భర్త అజితేశ్​ కుమార్​లకు రక్షణ కల్పించాలని నిర్ణయం వెలువరించింది కోర్టు.

కోర్టు తీర్పు వెలువరించిన కాసేపటికే... వారు బయటకు వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు సాక్షి భర్తపై దాడి చేశారు. వారికి ప్రాణహాని ఉందని.. అందుకే రక్షణ కల్పించాలని కోర్టుకు విన్నవించినట్లు పిటిషనర్​ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

పోలీసులు, ఎమ్మెల్యే రాజేశ్​ మిశ్రా.. తమకు ఎలాంటి ఇబ్బందులు సృష్టించకుండా ప్రశాంతమైన జీవితం గడిపేలా చూడాలని అభ్యర్థించారా దంపతులు.

ఇదీ జరిగింది...

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన భాజపా ఎమ్మెల్యే రాజేశ్​ మిశ్రా కూతురు సాక్షి. బ్రాహ్మిణ్​ అయిన ఆమె.. నిమ్న వర్గానికి చెందిన అజితేశ్​ను ప్రేమవివాహం చేసుకుంది. ఇది తన తండ్రికి ఇష్టం లేదని... ఆయనతో తమ ప్రాణాలకు ముప్పుందని కోర్టును ఆశ్రయించారు. వీరి అభ్యర్థనను స్వీకరించిన న్యాయస్థానం.. రక్షణ కల్పించాలని ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details