తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా వ్యూహాలు.. దిల్లీకి ఖట్టర్

హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా భాజపా పావులు కదుపుతోంది. ఇందుకోసం పార్టీ ముఖ్యనేతలతో చర్చించేందుకు తాజాగా దిల్లీకి బయలుదేరారు ముఖ్యమంత్రి మనోహర్​లాల్​ ఖట్టర్​. స్వతంత్ర అభ్యర్థులను పక్కనబెట్టి.. జేజేపీతో జట్టు కట్టేందుకు భాజపా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా వ్యూహాలు.. దిల్లీకి ఖట్టర్

By

Published : Oct 25, 2019, 10:01 AM IST

హరియాణాలో హంగ్ ఫలితం వచ్చిన వేళ..... అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపా అధికారం దక్కించుకునేందుకు..... వేగంగా పావులు కదుపుతోంది. ప్రభుత్వం ఏర్పాటుకుకేవలం ఆరు సీట్ల దూరంలో నిలిచిపోయిన కమలదళం......పది మంది ఎమ్మెల్యేలు ఉన్న జననాయక్ జనతా పార్టీతో మంతనాలు జరుపుతోంది. మరోవైపు....... అధిష్ఠానం పిలుపు మేరకు ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ దిల్లీ వెళ్లారు.

రెబల్స్​కు నో.. దుష్యంత్​కు సై!

ఏడుగురు స్వతంత్రుల్లో అత్యధికులు భాజపా రెబల్స్‌కాగా.. వారిమద్దతు తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు.... భాజపా అధిష్ఠానం అంత సుముఖంగా లేదని తెలుస్తోంది. స్వతంత్రులపై ఆధారపడకుండా 10స్థానాలు గెలిచిన జేజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు.. కమలనాథులు తెరవెనక మంత్రాంగం నెరుపుతున్నట్లు సమచారం. జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా... నేడు పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశంకానున్నారు. ఈ సమావేశంలో ఎవరికి మద్దతు ఇచ్చేది.. ఆయన ప్రకటిస్తారు. భాజపాకే దుష్యంత్ మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్వరలోనే భాజపా అధ్యక్షుడు అమిత్ షాతో.... దుష్యంత్ సమావేశంకానున్నట్లు జేజేపీ వర్గాలు వెల్లడించాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details