తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కుల్​భూషణ్​ జాదవ్ కేసు తీర్పులో సత్యమేవ జయతే'

అంతర్జాతీయ న్యాయస్థానం.... కుల్​భూషణ్​ జాదవ్​ మరణశిక్ష నిలిపివేస్తూ తీర్పు వెలువరించడంపై భారత్​లోని వివిధ రాజకీయపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇది భారత్​కు అతిపెద్ద విజయంగా అభివర్ణించాయి. మరో వైపు పాకిస్థాన్​ కూడా ఇది తమ విజయమని ప్రకటించుకోవడం గమనార్హం.

'కుల్​భూషణ్​ జాదవ్ కేసు తీర్పులో సత్యమేవ జయతే'

By

Published : Jul 18, 2019, 5:27 AM IST

Updated : Jul 18, 2019, 1:39 PM IST

భారత నౌకాదళ విశ్రాంత అధికారి కుల్​భూషణ్​ జాదవ్​ మరణశిక్షను నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వివిధ రాజకీయ పార్టీల నేతలు స్వాగతించారు. ఐసీజే తీర్పు భారత దేశానికి అతిపెద్ద విజయంగా రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్ అభివర్ణించారు.

"కుల్​భూషణ్ జాదవ్​ కేసులో ఐసీజే ఇచ్చిన తీర్పు భారత్​కు అతిపెద్ద విజయం. జాదవ్​కు న్యాయవాదిని కలుసుకునే అవకాశం కల్పించాలని, అలాగే మరణశిక్షను పునఃసమీక్షించాలని పాకిస్థాన్​ను ఐసీజే ఆదేశించడం స్వాగతించే నిర్ణయం. ఇది ప్రధాని నరేంద్ర మోదీ దౌత్య విజయం."
-రాజ్​నాథ్​ సింగ్​, భారత విదేశాంగ మంత్రి

ఐసీజే తీర్పుపై భారత్ హర్షం

"సీఐజే-ఐసీజే ఇదో గొప్ప రోజు! ఇది సత్యం సాధించిన విజయం. ఇది మానవ గౌరవాన్ని కాపాడుతుంది. భారతీయులందరినీ రక్షించాలనే మోదీ ప్రభుత్వ నిబద్ధతకు, దౌత్య ప్రయత్నాలకు ఇది నిదర్శనం. ఈ కేసు విషయంలో అద్భుత కృషి చేసిన హరీష్​ సాల్వేకి నా అభినందనలు" -అమిత్​షా, కేంద్రహోంమంత్రి

ఐసీజే తీర్పుపై భారత్ హర్షం

ఐసీజే తీర్పును మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు మాజీ కేంద్ర విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్​ పేర్కొన్నారు. ఇది భారత్​కు అతిపెద్ద విజయమని పేర్కొన్నారు. జాదవ్​ కేసను ఐసీజే ముందు ఉంచడంలో ప్రధాని మోదీ చొరవ చూపారన్న సుష్మా.. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయస్థానం తీర్పు జాదవ్​ కుటుంబ సభ్యులకు సాంత్వన చేకూరుస్తుందని ఆమె అన్నారు. ఐసీజే ముందు భారత్​ తరపున న్యాయవాది హరీష్​ సాల్వే బలంగా వాదనలు వినిపించారని ఆమె కొనియాడారు.

ఐసీజే తీర్పుపై భారత్ హర్షం
ఐసీజే తీర్పుపై భారత్ హర్షం

తప్పు మీది కాదు... ఇంగ్లీష్​ది...

కులభూషణ్​ జాదవ్​ కేసులో విజయం మాదే అని పాకిస్థాన్​ పేర్కొంది. దీనిపై అధికార భాజపా పార్టీ నేతలు మండిపడ్డారు.

"ఇది మీ తప్పుకాదు... తీర్పు ఇంగ్లీష్​లో ఇవ్వబడింది."
- గిరిరాజ్​ సింగ్​, కేంద్రమంత్రి ట్వీట్

సత్యమేవ జయతే..

కుల్​భూషణ్​ జాదవ్​ కేసులో భారత్​కు అనుకూలంగా ఐసీజే తీర్పునివ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. అయితే జాదవ్​ భద్రత గురించి ఎలాంటి వివరణలేదు. అతనికి పాకిస్థాన్ న్యాయస్థానాల నుంచి హాని ఉంది అని కాంగ్రెస్ అభిప్రాయపడింది.

"నేను ఐసీజే తీర్పును స్వాగతిస్తున్నాను. ఈ రాత్రి నా ఆలోచనలు పాకిస్థాన్​ జైలు గదిలో ఒంటరిగా ఉన్న కుల్​భూషణ్​ జాదవ్​ పైనే ఉంటాయి. మనస్థాపానికి గురైన అతని కుటంబానికి ఈ తీర్పు అరుదైన ఉపశమనం, ఆనందం, కొత్త ఆశను కలిగిస్తుంది. అతను ఒక రోజు స్వేచ్ఛగా భారత్​లోని తన ఇంటికి తిరిగివస్తాడు."-రాహుల్​గాంధీ, కాంగ్రెస్​ నేత

ఐసీజే తీర్పుపై భారత్ హర్షం

కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి ప్రియాంక గాంధీ ఐసీజే తీర్పును హృదపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

"చివరికి న్యాయం గెలిచింది. ఈ సమయంలో భారతదేశం మొత్తం జాదవ్​ కుటుంబంతో కలిసి ఆనందాన్ని పంచుకుంటుంది." -ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

ఐసీజే తీర్పుపై భారత్ హర్షం

"పాకిస్థాన్ వియన్నా కన్వెన్షన్ ఆర్టికల్​ 36ను పూర్తిగా ఉల్లంఘించింది. చట్ట విరుద్ధంగా కుల్​భూషణ్​కు మరణశిక్షను విధించింది. ఈ శిక్షను నిలిపివేస్తూ ఐసీజే ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం. సత్యమేవ జయతే!"-రణదీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

ఐసీజే తీర్పుపై భారత్ హర్షం

ఐసీజే తీర్పును ఎన్​సీపీ స్వాగతిస్తున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి నవాబ్​ మాలిక్ తెలిపారు.

"మేము ఐసీజే తీర్పును స్వాగతిస్తున్నాం. ఈ న్యాయపోరాటంలో గెలిచి జాదవ్ ఇంటికి తిరిగి వస్తాడని నమ్ముతున్నాం." -నవాబ్​ మాలిక్​, ఎన్​సీపీ అధికార ప్రతినిధి

ఇదీ చూడండి: 'జాదవ్​ తీర్పుతో న్యాయవాదిగా గర్విస్తున్నా'

Last Updated : Jul 18, 2019, 1:39 PM IST

ABOUT THE AUTHOR

...view details