తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగ్రవాద వ్యతిరేక చట్టం ఆమోదానికి భాజపా కృషి - uapa amendment bill

ఉగ్రవాద వ్యతిరేక చట్టం (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం) సవరణ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందాలని భాజపా కృషి చేస్తోంది. రేపు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెడతున్న కారణంగా భాజపా ఎంపీలందరూ హాజరు కావాలని ఆ పార్టీ విప్​ జారీ చేసింది.

భాజపా

By

Published : Aug 1, 2019, 11:27 PM IST

ఉగ్రవాద నిర్మూలనకు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం(యూఏపీఏ)లో ప్రభుత్వం చేసిన సవరణల బిల్లును రేపు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. కొన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ బిల్లుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదం పొందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది.

రాజ్యసభలో తక్కువ మెజారిటీ కారణంగా భాజపా ఎంపీలందరూ తప్పకుండా హాజరు కావాలని ఆ పార్టీ మూడు వ్యాక్యాల విప్​ జారీ చేసింది. ఇప్పటికే ఈ బిల్లుకు జులై 24న లోక్​సభ ఆమోదం తెలిపింది.

బిల్లుకు ఆమోదం లభిస్తే..

ఇప్పటివరకు ఉగ్రవాద సంస్థలపైనే నిషేధం విధించేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉండేది. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే తీవ్రవాదులపై వ్యక్తిగతంగా ఉగ్రవాద ముద్ర వేసే అవకాశం భారత ప్రభుత్వానికి కలుగుతుంది. ఫలితంగా సదరు వ్యక్తి ప్రయాణాలు, ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలు ఉంటాయి. ఇతర దేశాలతో ఆ ఉగ్రవాది పూర్తి వివరాలను భారత్​ పంచుకుంటుంది.

బిల్లు చట్టంగా మారగానే మొదటిగా పఠాన్​కోట్​, ముంబయి ఉగ్రదాడుల సూత్రధారులు మసూద్​ అజార్​, హఫీజ్​ సయీద్​లపై ఉగ్రవాద ముద్ర వేస్తామని కేంద్ర హోంశాఖ అధికార వర్గం ఇప్పటికే ప్రకటించింది.

ఇదీ చూడండి: జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

ABOUT THE AUTHOR

...view details