లోక్‌సభ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సొంతం చేసుకుంది భాజపా. అధికారంలో ఉన్న గుజరాత్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపురల్లో అన్ని స్థానాలను కైసవం చేసుకుంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన రాజస్థాన్‌లోనూ క్లీన్‌స్వీప్ చేసి పునర్‌వైభవం సాధించింది. దేశ రాజధాని దిల్లీలో ఆమ్‌ఆద్మీకి నిరాశ మిగులుస్తూ 7 నియోజకవర్గాలనూ తన ఖాతాలో వేసుకుంది కమల దళం. ఇక్కడ ముగ్గురు ఆమ్ఆద్మీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి.
రాజధానిలో తూర్పు దిల్లీ అభ్యర్థి గౌతం గంభీర్, సీనియర్ నాయకురాలు మీనాక్షి లేఖి, కేంద్ర మంత్రి హర్షవర్ధన్ గెలుపొందారు.
సొంత పార్టీనే అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న నాలుగు స్థానాలను గెలుపొందింది కమలదళం.
సార్వత్రిక ఫలితాల్లో భాజపా క్లీన్‌స్వీప్ చేసిన రాష్ట్రాలు...
- గుజరాత్ -26/26
- రాజస్థాన్ -25/25
- హరియాణా -10/10
- దిల్లీ -07/07
- ఉత్తరాఖండ్ -05/05
- హిమాచల్ ప్రదేశ్ -04/04
- అరుణాచల్ ప్రదేశ్ -02/02
- త్రిపుర -02/02