"ఓటర్లను మత ప్రాతిపదికన ప్రభావితం చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్, పార్టీ సభ్యులు ఇటీవల ప్రయత్నించారు"- నీరజ్, భాజపా దిల్లీ విభాగం న్యాయ సలహాదారు
'మసీదుల్లో రాజకీయం వద్దు' - ఎన్నికల కమిషన్
మత ప్రాతిపదికన రాజకీయ ప్రచారం చేపట్టకుండా మసీదుల వద్ద పరిశీలకులను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది.
మసీదుల్లో రాజకీయం వద్దని ఈసీకి భాజపా ఫిర్యాదు
మైనార్టీల ఓట్లను కొల్లగొట్టేందుకు నిరాధార ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు నీరజ్. మసీదుల వద్ద ఘర్షణ చెలరేగితే ప్రత్యేక పరిశీలకుల నివేదిక మేరకే ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలన్నారు. భాజపా ఫిర్యాదుపై ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా స్పందించలేదు.