ప్రచార వీడియోపై నెటిజన్ల విమర్శలు ఒడిశాలో భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఎన్నికల ప్రచారంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ప్రచారంలో భాగంగా ఓ కుటుంబంతో కలిసి భోజనం చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు సంబిత్. ఇది చూసిన అధికార బిజూ జనతా దళ్.. భాజపాపై విరుచుకుపడింది. ఉజ్వల యోజన విఫలమైందా అంటూ చురకలు అంటించింది.
వీడియోలో కనిపించే మహిళ కట్టెల పొయ్యి మీద వంట చేయటమే విమర్శలకు కారణం. ఈ విషయాన్ని గుర్తించిన బీజేడీ నేతలు, కార్యకర్తలు, నెటిజన్లు... భాజపా పథకం విజయవంతమైందని చెప్పేందుకు ఇదే నిదర్శమని ఎద్దేవా చేస్తున్నారు.
"ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ఎంత విజయవంతమైందో సంబిత్ పాత్రా నిరూపించారు. ఈ వీడియోతో భాజపా చేస్తున్న అబద్ధపు ప్రచారాలు బయటపడ్డాయి."
- బిజూ జనతాదళ్ పార్టీ
" పేద మహిళలు ఇంకా కట్టెల పొయ్యి మీదనే వంట చేస్తుంటే ఉజ్వల పథకం ఉపయోగం ఏముంది?"
-ఫేస్బుక్ వినియోగదారుడు
పూరి నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు సంబిత్.
ఇదీ చూడండి:''నమో' టీవీ ప్రసారాలను నిలిపేయండి'