తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పీఎం నరేంద్ర మోదీ'పై  ఏప్రిల్​ 15న విచారణ

'పీఎం నరేంద్ర మోదీ' చిత్రంపై ఎన్నికల సంఘం నిషేధం విధించడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నెల 15న విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఈసీ.. ఈ సినిమా విడుదలకు అడ్డుతగిలింది.

'పీఎం నరేంద్ర మోదీ'పై  ఏప్రిల్​ 15న వాదనలు

By

Published : Apr 12, 2019, 1:39 PM IST

Updated : Apr 12, 2019, 3:37 PM IST

'పీఎం నరేంద్ర మోదీ'పై ఏప్రిల్​ 15న విచారణ

'పీఎం నరేంద్ర మోదీ' చిత్రంపై ఎన్నికల సంఘం నిషేధం విధించడాన్ని చిత్ర నిర్మాతలు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. వీరు దాఖలు చేసిన ఈ పిటిషన్​ను ఏప్రిల్​ 15వ తేదీన సర్వోన్నత న్యాయస్థానం విచారించనుంది. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌పై ఎన్నికల సంఘం బుధవారంనిషేధం విధించింది.

రాజకీయ పార్టీలకు, నేతలకు మేలు చేకూర్చే చిత్రాలు ఎలక్ట్రానిక్‌ మీడియాలోనూ ప్రసారం చేయవద్దని స్పష్టం చేసింది. మోదీ బయోపిక్‌ విడుదలపై స్టే విధించాలని ఓ కాంగ్రెస్‌ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ అంశంపై ఈసీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. సినిమాకు సెన్సార్‌ కానందున దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని ప్రకటించింది ఈసీ.

'పీఎం నరేంద్ర మోదీ' చిత్రానికి మంగళవారం.. సెన్సార్‌ ధ్రువీకరణ పత్రం వచ్చింది. ఎన్నికల సంఘం ఈ చిత్రంపై నిషేధం బుధవారం విధించింది.

Last Updated : Apr 12, 2019, 3:37 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details