తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భార్యపై జూదం.. ఆపై సామూహిక అత్యాచారం! - బిహార్​లో జాదం

​భర్త జూదంలో ఓడిపోవడం వల్ల భార్యను సామూహిక అత్యాచారం చేశారు కొందరు కీచకులు. ఈ దారుణ ఘటన బిహార్​ భాగల్​పుర్​లో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Bihar man loses wife in gambling match
పందెంలో ఓడిపోయిన భర్త-సామూహిక అత్యాచారానికి గురైన భార్య

By

Published : Dec 14, 2020, 7:19 AM IST

బిహార్​ భాగల్​పుర్​లో దారుణం జరిగింది. జూదంలో భార్యనే ఒడ్డాడు ఓ భర్త. ఆటలో ఓడిపోవడం కారణంగా ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు జూదగాళ్లు.

భార్యపైనే..

పందేలకు, తాగుడుకు బానిసైన ఆమె భర్త జూదానికి డబ్బులు లేక ఆమెపైనే పందెం కాశాడు. అందులో ఓడిపోవడం వల్ల గెలిచిన వారితో వెళ్లాలని భార్యను బలవంతపెట్టాడు. ఈ క్రమంలో ఆమెపై కీచకులు సామూహిక అత్యాచారం చేశారు.

నిందితుల చెర నుంచి తప్పించుకున్న మహిళ తల్లిదండ్రుల వద్దకు చేరింది. తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. దీంతో బాధితురాలు, బంధువులు పోలీస్​ స్టేషన్​ను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: బస్సు బోల్తా-20 మంది పరిస్థితి విషమం!

ABOUT THE AUTHOR

...view details