భువనేశ్వర్ సెంట్రల్ అభ్యర్థులపై బాంబు దాడులు - ఒడిశా
ఒడిశాలోని భువనేశ్వర్ సెంట్రల్ అసెంబ్లీ అభ్యర్థులే లక్ష్యంగా బాంబు దాడులు జరిగాయి. భాజపా, బీజేడీ అభ్యర్థులు లక్ష్యంగా వేర్వేరు ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తులు దాడులకు తెగబడ్డారు.
భువనేశ్వర్ సెంట్రల్ అభ్యర్థులపై బాంబు దాడులు
ఒడిశాలోని భువనేశ్వర్ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా జగన్నాథ్ ప్రధాన్, బిజు జనతా దళ్ నుంచి అనంత్ నారాయణ్ జేనా బరిలో నిలిచారు. ఇద్దరు నేతలపై వేర్వేరు ప్రదేశాల్లో గుర్తు తెలియని వ్యక్తులు బాంబులతో దాడి చేశారు. నేతలిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తమ పార్టీ అభ్యర్థిపై బాంబు దాడిపై విచారణ జరిపించాలని భాజపా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఘటనలకు గల కారణాలు తెలియరాలేదు.