బంగాల్లోని పురూలియా జిల్లా బలరాంపుర్ ప్రాంతం వంగిడి వాసులు వినూత్నంగా స్వీయ నిర్బంధం చేసుకున్నారు. కరోనా విజృంభిస్తోన్న వేళ చెట్టుపై నిర్బంధంలో ఉంటున్నారు. ఒంటరిగా ఉండేందుకు ఇళ్లు సరిపోక... ఏనుగుల సంచారం ఎక్కువగా ఉన్న కారణంగా ఆరుబయట ఉండలేక వృక్షాలను ఆశ్రయించారు.
ఇదీ జరిగింది..
వంగిడికి చెందిన పలువురు ఇటీవల చెన్నై నుంచి స్వగ్రామానికి వచ్చారు. వారికి వైరస్ సోకి ఉండవచ్చన్న అనుమానంతో గ్రామస్థులు 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. అయితే వారు ఒంటరిగా ఉండేందుకు ఇళ్లు సరిపోయేంత పెద్దగా లేవు. ఈ ప్రాంతంలో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆరుబయట ఉండేందుకు అవకాశం లేదు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉన్న చెట్లను ఆవాసంగా చేసుకున్నారు. చెట్లపైనే నివాసానికి అనుకూలంగా మలచుకుని 14 రోజులు ఎప్పుడు గడుస్తాయా అని ఎదురుచూస్తున్నారు.
ఇదీ చూడండి:విపత్తు నిధులతో వలస కూలీలకు ఆహారం, వసతి