భోపాల్‌లోని మథేలా స్టేషన్‌కి కిలోమీటరు దూరంలో ఆపిన గూడ్స్ రైలు ఉన్నట్టుండి వ్యతిరేక దిశలో పట్టాలపై పరుగులు పెట్టింది. కొంత దూరం ప్రయాణించి పట్టాలపై ఆగిఉన్న మరో గూడ్స్ రైలును ఢీకొని ఆగింది.
మథేలా నుంచి నిమాడ్ ఖేడి జిల్లా వరకు థర్మల్ విద్యుత్తు తయారీకి బొగ్గు తీసుకెళ్లేందుకు వీలుగా పక్కనే ఓ ట్రాక్ నిర్మిస్తున్నారు. అక్కడ కంకర, సామగ్రిని దింపేందుకు ఈ రైలును వాడుతున్నారు. కానీ ఆ రైలుకు లాకింగ్ సరిగా చేయనందున బోగీలన్నీ మెల్లిగా కదిలి పల్లంవైపు ట్రాక్‌పై వేగం పెరిగి దూసుకుపోయింది.
ఇంజన్ లేకుండానే గూడ్స్ రైలు పరుగులు
మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలో ఇంజన్ లేకుండానే గూడ్స్ రైలు పట్టాలపై పరుగులు పెట్టింది. రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగింది. అదృష్టం బాగుండి వేగం తగ్గిన ఆ రైలు... ఆగిఉన్న మరో గూడ్స్ రైలును ఢీకొని ఆగిపోయింది.
జరిగినది తప్పుని ఇంకా ఒప్పుకోని అధికారులు ఘటనపై విచారిస్తున్నామని వెల్లడించారు.
ఇదీ చూడండి:ఇంజినీర్‌పై మహా ఎమ్మెల్యే 'బురద దాడి'
Last Updated : Jul 4, 2019, 7:48 PM IST