అయోధ్య భూవివాదం కేసులో ముస్లింల తరఫున వాదనలు వినిపించవద్దని తనను బెదిరిస్తున్నారని సుప్రీంకోర్టుకు నివేదించారు సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్. బెదిరించివారిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని మంగళవారం విచారిస్తామని సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.
2019 ఆగస్టు 14న విశ్రాంత విద్యా అధికారి ఎన్. శణ్ముగమ్ నుంచి తనకు బెదిరింపు లేఖ అందిందని పిటిషన్లో పేర్కొన్నారు రాజీవ్. సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున వాదించొద్దని హెచ్చరించినట్లు తెలిపారు.
రాజీవ్ ధావన్ తరఫున సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ సుప్రీంలో వాదనలు వినిపించనున్నారు.