తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య రైల్వే స్టేషన్​ కొత్త డిజైన్​ చూశారా? - అయోధ్య రైల్వే స్టేషన్​ పునర్నిర్మాణం

రామమందిర నిర్మాణం నేపథ్యంలో అయోధ్య రైల్వేస్టేషన్​నూ ప్రత్యేక హంగులతో పునర్నిర్మించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి దశ పనులు 2021 జూన్​ నాటికి పూర్తి కానున్నాయి. 2023-24 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైల్వే స్టేషన్​ డిజైన్​కు సంబంధించి మంత్రి పీయూష్ గోయల్​ కొన్ని చిత్రాలు విడుదల చేశారు.

Ayodhya Railway Station
అయోధ్య రైల్వే స్టేషన్

By

Published : Aug 4, 2020, 9:33 AM IST

అయోధ్యలో ఆగ‌స్టు 5వ తేదీన రామ మందిర నిర్మాణ భూమి పూజ‌కు అంతా సిద్ధమైంది. ఇదే సమయంలో యాత్రికులు చేరుకునే అయోధ్య రైల్వే స్టేషన్​ను సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. రామమందిర నమూనాలో రైల్వే స్టేషన్​ పునర్నిర్మాణం చేపట్టనుంది ప్రభుత్వం.

కొత్త డిజైన్ ఇదే..

అయోధ్య రైల్వే స్టేషన్​ పునర్నిర్మాణాన్ని రెండు దశల్లో చేపట్టనున్నారు. మొదటి దశలో ప్లాట్​ఫామ్​లను నిర్మిస్తారు. అనంతరం రెండో దశలో కొత్త భవనాలు, అధునాతన సౌకర్యాలు, వసతి, మరుగుదొడ్లు వంటివి నిర్మిస్తారు. మొదటి దశ పనులు 2021 జూన్​ నాటికి పూర్తికానున్నాయి. మొత్తం నిర్మాణం 2023-24 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.

కొత్త డిజైన్ ఇదే..

పనులు వేగవంతం..

తొలుత ఈ ప్రాజెక్టుకు 80 కోట్లు కేటాయించిన రైల్వే శాఖ.. దానిని రూ.104.77 కోట్లకు పెంచింది. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు.

"అయోధ్య చాలా ముఖ్యమైన, పవిత్రమైన నగరం. భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి ఆధునికీకరించటం చాలా అవసరం. భక్తులు, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించటం మా బాధ్యత."

- సంజయ్ త్రిపాఠి, రైల్వే డివిజనల్​ మేనేజర్​

డిజైన్ ఇదే..

కొత్త డిజైన్ ఇదే..

అయోధ్య రైల్వే స్టేషన్​కు సంబంధించి కొత్త డిజైన్​ ఫొటోలను కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్ విడుదల చేశారు. నగరానికి తరలివచ్చే కోట్ల మంది భక్తుల కోసం రైల్వే శాఖ అభివృద్ధి పనులు చేపట్టింది.

కొత్త డిజైన్ ఇదే.. ో

ఇదీ చూడండి:రేపే ముహూర్తం- భూమిపూజకు శరవేగంగా ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details