తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"అయోధ్యలో గతం గతః" - రామమందిరం

అయోధ్య వివాదంలో గతంతో పనిలేదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. సమస్య పరిష్కారమే కోర్టు తక్షణ కర్తవ్యమని పేర్కొంది అత్యున్నత న్యాయస్థానం. తీర్పు వాయిదా వేసింది.

అయోధ్య వివాదం

By

Published : Mar 6, 2019, 12:36 PM IST

అయోధ్య వివాదంపై బుధవారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు తీర్పు వాయిదా వేసింది. ప్రజల మనోభావాలు, నమ్మకం, విశ్వాసాలు దీనితో మిళితమయ్యాయని, కేసు తీవ్రతను అర్థం చేసుకోగలమని విచారణ సందర్భంగా న్యాయస్థానం పేర్కొంది.

సమస్య పరిష్కారానికి ఒక మధ్యవర్తి సరిపోడని, పలువురు సభ్యులతో కూడిన మండలిని ఏర్పాటు చేయాలని అభిప్రాయపడింది. ఇరు వర్గాలు మధ్యవర్తుల పేర్లను ప్రతిపాదించాలని సుప్రీం సూచించింది.

"గతంలో ఏం జరిగిందో అనవసరం. ప్రస్తుతం సమస్య ఎలా పరిష్కరించాలన్నదే ముఖ్యం. మధ్యవర్తిత్వమే దీనికి సరైన పరిష్కారం చూపుతుంది. అయితే వారు అందరి వాదనలు వినాలి. నివేదిక విషయంలో గోప్యత అవసరం."
-జస్టిస్ ఎస్​ఏ బాబ్డే, సుప్రీం కోర్టు న్యాయమూర్తి

మధ్యవర్తి నియామకానికి ముస్లిం సంఘాల తరఫు న్యాయవాది రాజీవ్​ ధావన్​ సానుకూలంగా స్పందించారు.

"ముస్లిం సంఘాలన్నీ మధ్యవర్తిత్వంతో రాజీ కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే వారికి అది అన్యాయం చేయకుండా ఉంటేనే సాధ్యమవుతుంది."
-రాజీవ్​ ధావన్​, ముస్లిం పిటిషనర్ల తరఫు న్యాయవాది

ఇదీ చూడండి:మధ్యవర్తిత్వంపై నేడు నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details