తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భక్తులు ముట్టుకోకుండానే మోగే గంట ఇది! - sensor ghanti in temple mandsaur

గుడికి వెళ్లి దేవుడికి మన బాధలు చెప్పుకుంటే కష్టాలు తీరిపోతాయా? దేవుడు మన కోరికలను వింటేనే కదా.. తీర్చేది? మరి అలా వినాలంటే, దండం పెట్టుకునే ముందు గంట కొట్టి ఆయన మన మొర ఆలకించేలా చేసుకోవాలి. కానీ, ఈ కరోనా కాలం ఒకరు కొట్టిన గంటను మరొకరు తాకితే ఇంకేమైనా ఉందా? అందుకే, మధ్యప్రదేశ్​లోని పశుపతినాథ్ ఆలయంలో ముట్టుకోకుండానే గంట కొట్టేస్తున్నారు భక్తులు.

Automatic sensor bell installed at Pashupatinath temple in MP
భక్తులు ముట్టుకోకుండానే గంట మోగుతుంది!

By

Published : Jun 13, 2020, 2:29 PM IST

మధ్యప్రదేశ్ మంద్​సౌర్​​​ పశుపతినాథ్​ ఆలయంలో అటోమేటిక్​ సెన్సార్ గంటను ఏర్పాటు చేశారు నిర్వాహకులు.

సుదీర్ఘ లాక్​డౌన్​ తరువాత భక్తులకు తమ ఇష్టదైవాను దర్శించుకునే అవకాశం దక్కింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఆలయాలకు వెళ్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు పాటించినా... దేవుడి ముందు ఉండేది ఒకే గంట. మరి అందరూ అదే గంటను ముట్టుకుంటే వైరస్​ సోకే ప్రమాదముంది కదా! అందుకే, ఇలా ముట్టుకోకుండా గంట కొట్టే ఏర్పాటు చేశారు. ​

భక్తులు ముట్టుకోకుండానే గంట మోగుతుంది!

పవిత్రమైన దేవాలయాల్లో వైరస్​ వ్యాప్తిని తగ్గించే ప్రయత్నం చేశాడు నహ్రూ ఖాన్. అందుకే ఈ సెన్సార్​ గంటను రూపొందించి అందరి మన్ననలూ పొందుతున్నాడు. ఈ సెన్సార్​ బెల్​ ముందు చేతిని చూపిస్తే చాలు గంట దానంతటదే మోగుతుంది.

భక్తులు ముట్టుకోకుండానే గంట మోగుతుంది!
భక్తులు ముట్టుకోకుండానే గంట మోగుతుంది!
భక్తులు ముట్టుకోకుండానే గంట మోగుతుంది!భక్తులు ముట్టుకోకుండానే గంట మోగుతుంది!

"గుడిలో గంట కొట్టడం భక్తుల ఆనవాయితీ. కానీ, గంట కొట్టడం వల్ల ఈ కరోనా కాలంలో వైరస్ సోకే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని దూరం చేసేందుకే ఈ బెల్​ తయారు చేశాను."

-నహ్రూ ఖాన్​

ఇదీ చదవండి:భార్యను వెలకట్టి స్నేహితులకు అమ్మేసిన భర్త!

ABOUT THE AUTHOR

...view details