తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విమర్శించినవారే 'బడ్జెట్'​ను స్వాగతించారు: మోదీ

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​- 2020పై ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కొందరు ప్రయత్నించారన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ మేరకు భాజపా పార్లమెంటరీ భేటీలో ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు.

pm-bjp
విమర్శించినవారే 'బడ్జెట్'​ను స్వాగతించారు: మోదీ

By

Published : Feb 4, 2020, 3:16 PM IST

Updated : Feb 29, 2020, 3:45 AM IST

విమర్శించినవారే 'బడ్జెట్'​ను స్వాగతించారు: మోదీ

కేంద్రం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్​- 2020పై ప్రజలను తప్పుదోవ పట్టించే కొన్ని ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ. కానీ విమర్శించిన వారే... ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఈ బడ్జెట్​ను ఉత్తమమైనదిగా ఇప్పుడు గుర్తించారని తెలిపారు. ఈ మేరకు భాజపా పార్లమెంటరీ సమావేశంలో ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా బోడో ఒప్పందంపై ప్రశంసలు కురిపించారు. ఈ ఒప్పందం చారిత్రకమైన విజయంగా అభివర్ణించారు. దీనివల్ల ఎన్నో దశాబ్దాలుగా త్రిపురలో హింసాత్మక చర్యలతో రక్తపు మడుగులో మగ్గిపోయిన బ్రూ- రియాంగ్ తెగ జీవితాలు స్థిరపడేందుకు అవకాశం కలుగుతుందని ఆకాంక్షించారు.

తొలిసారి...

భాజపా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్లమెంటరీ భేటీకి తొలిసారి హాజరైన జె.పి.నడ్డాను ఈ సభలో మోదీ ఇతర నేతలు సన్మానించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ ఫిబ్రవరి 8న దిల్లీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 240కి పైగా పార్టీ ఎంపీలు హస్తినలోని బీద ప్రాంతాల్లో ప్రజలకు చేరువయ్యేందుకు అక్కడ పర్యటిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి : చిన్నారికి బలవంతంగా మద్యం తాగించిన రౌడీ డాడీ!

Last Updated : Feb 29, 2020, 3:45 AM IST

ABOUT THE AUTHOR

...view details