తమిళనాడు కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో 'అత్తివరదరాజ స్వామి వైభవం' అట్టహాసంగా ముగిసింది. సుమారు కోటి మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 40 ఏళ్ల అనంతరం భక్తులకు దర్శనమిచ్చిన స్వామి విగ్రహం 48 రోజుల అనంతరం తిరిగి కోనేరుకు చేరుకుంది.
స్వామివారిని కోనేరుకు తీసుకెళ్లే సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహం దెబ్బతినకుండా ఉండటానికి ప్రత్యేక మూలికలతో చుట్టారు. శనివారం అర్ధరాత్రి 12 గంటలకు విగ్రహాన్ని కోనేరులో పెట్టి నీరు నింపారు.