తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అటల్​ ఇన్నోవేషన్స్​ ర్యాంకింగ్స్​లో ఐఐటీల జోరు

అటల్​ ఇన్నోవేషన్​ ర్యాంకింగ్స్​లో తొలి ముడు స్థానాలను మద్రాస్​, బాంబే, దిల్లీ ఐఐటీలు దక్కించుకున్నాయి. మొత్తం ఆరు కేటగిరీల్లో అందించే ఈ ర్యాంకింగ్స్​ను కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది.

Atal Innovation Ranking: Madras, Bombay and Delhi IITs bag top positions
అటల్​ ఇన్నోవేషన్​ ర్యాంకింగ్స్​లో ఐఐటీల జోరు

By

Published : Aug 18, 2020, 9:10 PM IST

'అటల్​ ర్యాంకింగ్​ ఆఫ్​ ఇన్​స్టిట్యూషన్స్​ ఆన్​ ఇన్నోవేషన్స్​ అచీవ్​మెంట్స్​' (ఏఆర్ఐఐఏ​) జాబితాను కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఉన్న కేంద్రం ఆధారిత ఇన్​స్టిట్యూట్స్​ కేటగిరీలో.. మద్రాస్​, బాంబే, దిల్లీ ఐఐటీలు తొలి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి.

ఆవిష్కరణ విషయంలో ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలకు ర్యాంకులు అందిస్తూ వస్తోంది కేంద్ర విద్యాశాఖ. ఆరు కేటగిరీల్లో ర్యాంకింగ్స్​ ఇస్తారు. అవి.. జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఉన్న కేంద్రం ఆధారిత సంస్థలు, రాష్ట్ర ఆధారిత వర్సిటీలు, రాష్ట్ర ఆధారిత స్వతంత్ర సంస్థలు, డీమ్డ్​ వర్సిటీలు, ప్రైవేటు సంస్థలు, కేవలం మహిళలకే ఉన్నత విద్య అందించే సంస్థలు.

తొలి కేటగిరీలో ఐఐఎస్​ఈ బెంగళూరు, ఐఐటీ ఖరగ్​పుర్​లు ,5 స్థానాలు దక్కించుకున్నాయి. టాప్​ 10లో 7 ఐఐటీలు చోటు దక్కించుకోవడం విశేషం.

రాష్ట్ర ఆధారిత వర్సిటీల్లో మహారాష్ట్రలోని ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ కెమికల్​ టెక్నాలజీ, పంజాబ్​ యూనివర్సిటీలు తొలి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి.

ఇదీ చూడండి:-ఒకట్రెండు రోజుల్లో టీకాపై మూడో దశ ట్రయల్స్

ABOUT THE AUTHOR

...view details