ఒడిశాలోని పూరి రైల్వేస్టేషన్లో భారీ ప్రమాదం తప్పింది. ఫ్లాట్‌ఫాంపై ఉన్న తపస్విని ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగీలో మంటలు చెలరేగాయి. గమనించిన రైల్వే సిబ్బంది తక్షణమే స్పందించి మంటలు ఆర్పేశారు.
ఈ ఘటన స్టేషన్‌లోని నాలుగో ప్లాట్‌ఫాంలో చోటుచేసుకుంది. అకస్మాత్తుగా ఎస్-4 బోగీలో నుంచి మంటలు చెలరేగాయి. క్రమంగా ఎస్-2, ఎస్-3, ఎస్-5 బోగీలకు వ్యాపించాయి.
కాలిపోతున్న బోగీలను వేరు చేసి మంటలు వ్యాపించకుండా అడ్డుకున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.
తపస్విని ఎక్స్‌ప్రెస్ పూరి నుంచి ఝార్ఖండ్‌లోని హతియాకు ప్రయాణిస్తుంది.
ఇదీ చూడండి:భవనం కూలిన ఘటనలో 13కు మృతుల సంఖ్య