1970 దశకంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాల వల్లే ఈశాన్య భారత్ ఇప్పటికీ చొరబాట్ల సమస్యను ఎదుర్కొవాల్సి వస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. అసోం గోహ్పూర్లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ ఏ విధంగా రాష్ట్రాన్ని మోసం చేసిందో పెద్దలను అడగాలని యువతకు సూచించారు.
హస్తం పార్టీ ప్రజలను మోసం చేసినప్పటికీ... చౌకీదార్(కాపాలాదారుడు) చొరబాట్లు, ఉగ్రవాదం, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని అన్నారు మోదీ. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అప్పుడు జన్‌సంఘ్‌లో ఉన్న వాజ్‌పేయి... బంగ్లాదేశ్ స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతిస్తూ గళాన్ని వినిపించారని గుర్తు చేశారు మోదీ.