అసోం రాజ్‌భవన్‌లో ఓ కరోనా పాజిటివ్ కేసు బయటపడింది. దీంతో కామ్రూప్ జిల్లా డిప్యూటి కమిషనర్ బిస్వజిత్.. రాజ్‌భవన్ క్యాంపస్‌ను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ప్రాంతాన్ని వెంటనే సీల్ చేయాల్సిందిగా గువాహటి రెవెన్యూ సర్కిల్ అధికారులను ఆదేశించారు.
రాజ్‌భవన్‌కు ఉత్తరాన హోటల్ బెల్లె వ్యూ, దక్షిణాన బోంకోవర్ నగర్, తూర్పున బోర్తాకూర్ క్లినిక్, పశ్చిమాన ఎంజీ రోడ్ వరకు కంటైన్మెంట్ జోన్ విస్తరించి ఉన్నట్లు స్పష్టం చేశారు అధికారులు.