నల్బారీ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చమత-కైతల్కుచి రోడ్డుపై భారీగా వరద నీరు చేరి, రవాణా వ్యవస్థ స్తంభించింది. జనాలు అవస్థలు పడుతున్నారు.
అసోం బార్పేటలో 600 గ్రామాలు జలమయం - అసోం బార్పేట
భారీ వర్షాలకు అసోం రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్తమయింది. వరదలకు లక్షల మంది నిరాశ్రయులయ్యారు. బార్పేట జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు సుమారు 600 గ్రామాలు నీటమునిగాయి. నల్బారీ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
అసోం బార్పేటలో 600 గ్రామాలు జలమయం
సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బార్పేట జిల్లాలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఎలాంటి వ్యాధులు సంక్రమించకుండా చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి:అసోంను ఆదుకుంటాం: ప్రధాని నరేంద్ర మోదీ