తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అరుణాచల్ ప్రదేశ్​​లో భూకంపం - arunachal

ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్​లో నేటి తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రాజధాని నగరం ఈటానగర్​కు 180 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ప్రకృతి విలయ తీవ్రత రిక్టర్​ స్కేల్​పై 6.1గా నమోదైంది.

అరుణాచల్ ప్రదేశ్​​లో భూకంపం

By

Published : Apr 24, 2019, 4:08 AM IST

ఈ రోజు తెల్లవారుజామున 1.45 నిమిషాలకు అరుణాచల్ ప్రదేశ్​లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్​ స్కేల్​పై 6.1గా నమోదైంది. ప్రకంపనల వివరాల్ని అమెరికా భూ పరిశోధన సంస్థ ప్రకటించింది.

రాజధాని నగరం ఈటానగర్​కు 180 కిలోమీటర్ల దూరంలో సంభవించిన ఈ భూకంప ప్రభావం 40 కిలోమీటర్ల మేర వ్యాపించింది. చదరపు కిలోమీటరుకు అతితక్కువ జన సాంద్రత కలిగిన అరుణాచల్ ప్రదేశ్​ జనాభా 12 లక్షలు. అయితే ఈ దుర్ఘటనలో ఎంతమంది ప్రభావితం అయ్యారన్న విషయం తెలియరాలేదు.

చైనా అధికారిక న్యూస్ ఏజెన్సీ జింగ్​హువా టిబెట్​లో భూకంపం సంభవించినట్లు ప్రకటించింది. అరుణాచల్ ప్రదేశ్ భూభాగం తమదని చైనా దశాబ్దాలుగా వాదిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details