ప్రకృతి అందాలకు నెలవైన ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్‌లో మళ్లీ కమలం వికసించింది. లోక్‌సభతో పాటు శాసనసభకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మరోసారి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది కమలం పార్టీ. 60 స్థానాల శాసనసభలో 35 స్థానాలు సాధించింది. జేడీయూ 7, కాంగ్రెస్ 4 సీట్లు సాధించాయి.
మొత్తం స్థానాలు | 60 |
భాజపా | 35 |
జేడీయూ | 7 |
కాంగ్రెస్ | 4 |
ఎన్పీఏ | 1 |
పీపీఏ | 1 |
సూర్యుడు ఉదయించే రాష్ట్రంలో క్రితం ఎన్నికలతో పోలిస్తే తాజాగా రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2014 విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 42 సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
రెండు సంవత్సరాలు గడవగానే 2016లో రాజకీయ సంక్షోభం నెలకొంది. అనేక మంది ముఖ్యమంత్రులు మారారు. చివరకు... పాలనా పగ్గాలే చేతులు మారాయి. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్(పీపీఏ)కు చెందిన 33మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది.
అభివృద్ధి నినాదంగా భాజపా...