ఆర్టికల్ 370: సుప్రీంను ఆశ్రయించిన ముఫ్తీ కూతురు జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని కలవనివ్వడానికి ఆదేశాలివ్వాలని ఆమె కుమార్తె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి ముఫ్తీ నిర్బంధంలోనే ఉన్నారు.
తన తల్లిని కలిసి నెల రోజులు గడిచినట్టు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు ఇల్తిజ. ముఫ్తీ ఆరోగ్యంపై ఇల్తిజ ఆవేదన వ్యక్తం చేశారు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇల్తిజ పిటిషన్పై గురువారం విచారణ చేపట్టనుంది.
కశ్మీర్లో నిర్బంధంలో ఉన్న సీపీఐ(ఎమ్) నేత మహమ్మద్ యూసఫ్ తరిగమిని కలవడానికి ఆగస్టు 29న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరీకి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఇల్తిజ దాఖలు చేసిన పిటిషన్ కూడా ఇదే తరహాకు చెందినదని ఆమె తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
ఇదీ చూడండి- పంజాబ్: భయానక పేలుడులో 23 మంది మృతి