ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సోదరి సురయ్య, కుమార్తె సఫియా నాయకత్వంలో కశ్మీరీ మహిళలు ఆందోళన చేపట్టారు. శ్రీనగర్ లాల్‌చౌక్ సమీపంలోని ప్రతాప్ ఉద్యానవనం వద్ద నల్ల బ్యాడ్జ్‌లు ధరించి, ప్లకార్డులు పట్టుకుని నిరసనకు దిగారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఆర్టికల్ 35 ఏ ను రద్దుచేయడం, జమ్ము కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడంపైనా ఆందోళన వ్యక్తం చేశారు. తమకు పౌర స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కశ్మీరీ ప్రజలను మోసగించి, అవమానించారని ఆరోపించారు.