తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దక్షిణ భారత దేశంలో ఉగ్రదాడులకు కుట్ర! - దక్షిణ భారత్​

దక్షిణ భారత దేశంలో దాడులు చేసేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు సైన్యం వెల్లడించింది. తీవ్రవాదులు సముద్ర మార్గంలో దేశంలోకి ప్రవేశించినట్లు తెలిపింది.

దక్షిణ భారత్​లో ఉగ్రదాడులకు కుట్ర!

By

Published : Sep 9, 2019, 4:45 PM IST

Updated : Sep 30, 2019, 12:12 AM IST

దక్షిణ భారత దేశంలో ఉగ్రదాడులకు కుట్ర!

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు అనంతరం భారత్​ను అస్థిరపరిచేందుకు పాకిస్థాన్​ దారులు వెతుకుతోంది. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు, ఉగ్రవాదులను దేశంలోకి పంపటం వంటివి చేస్తోంది.

తాజాగా దక్షిణ భారత దేశంలో దాడులు చేపట్టేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు సైన్యం వెల్లడించింది. సముద్ర మార్గంలో తీవ్రవాదులు దేశంలోకి ప్రవేశించినట్లు ఆర్మీ సదరన్​ కమాండ్​ జనరల్​ ఆఫీసర్​ కమాండింగ్​ లెఫ్టినెంట్​ జనరల్​ ఎస్​కే సైనీ తెలిపారు.

" దక్షిణ భారత దేశంలో దాడులు చేసేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఉంది. సర్​ క్రీక్​ సరిహద్దు వద్ద కొన్ని పడవలను గుర్తించాం. ఉగ్రదాడుల్ని అరికట్టేందుకు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు అన్నీ తీసుకున్నాం."

- లెఫ్టినెంట్​ జనరల్​ ఎస్​కే సైనీ, సదరన్​ కమాండ్​ జీఓసీ

ఇదీ చూడండి:'2030 నాటికి 2 కోట్ల 60 లక్షల హెక్టార్లకు పునరుజ్జీవం'

Last Updated : Sep 30, 2019, 12:12 AM IST

ABOUT THE AUTHOR

...view details