తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​ దుర్నీతికి మరో భారతీయ జవాను బలి

సరిహద్దు వెంబడి పాకిస్థాన్​ మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది​. జమ్ముకశ్మీర్​ పూంచ్​ సెక్టార్​లోని నియంత్రణ రేఖ వద్ద జరిపిన కాల్పుల్లో భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు. నాలుగు రోజుల్లో ఇద్దరు జవాన్లను పొట్టనపెట్టుకున్నాయి పాకిస్థాన్​ బలగాలు.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్​

By

Published : Mar 24, 2019, 1:26 PM IST

Updated : Mar 24, 2019, 2:42 PM IST

పాకిస్థాన్​ బలగాల కాల్పుల్లో భారత జవాను మృతి
ఓ వైపు ఇరు దేశాల మధ్య శాంతి కోరుకుంటున్నామని ప్రసంగాలు చేస్తూనే... మరోవైపు సరిహద్దు వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది పాకిస్థాన్​. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత జవాన్లపై కాల్పులకు తెగబడుతోంది.

శనివారం సాయంత్రం జమ్ముకశ్మీర్​ పూంచ్​ జిల్లాలోని షాపూర్​, కెర్నీ ప్రాంతాల్లో భారత జవాన్లు, సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డాయి పాక్​ బలగాలు. మోర్టార్​ బాంబులను విసిరాయి. ఈ ఘటనలో ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడు. భారత బలగాలు దీటుగా స్పందించాయి.

నాలుగు రోజుల్లో ఇద్దరు జవాన్లు...

గత నాలుగు రోజులుగా పాకిస్థాన్​ దుశ్చర్యలకు ఇద్దరు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. గురువారం సుందర్బాని సెక్టార్​లో జరిగిన కాల్పుల్లో ఆర్మీ జవాన్​ యష్​ పాల్​ మృతి చెందాడు.

2018లో 2,936 ఘటనలు

ఈ ఏడాది ఇప్పటి వరకు 125 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్​.

2003లో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. 15 ఏళ్లలో అత్యధికంగా 2018లోనే 2,936 ఘటనలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండీ: మాలిలో వేటగాళ్ల ఊచకోతకు 115 మంది బలి

Last Updated : Mar 24, 2019, 2:42 PM IST

ABOUT THE AUTHOR

...view details