తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​ చొరబాట్లను అడ్డుకున్న సైన్యం.. ఏడుగురి హతం! - loc

కశ్మీర్​లోని కెరాన్​ సెక్టార్​లో పాక్​ చొరబాట్లను అడ్డుకున్నట్లు భారత సైన్యం తెలిపింది. ఈ దాడుల్లో కనీసం అయిదుగురు ఉగ్రవాదులు మరణించి ఉంటారని వెల్లడించింది.

పాక్​ చొరబాట్లను అడ్డుకున్న సైన్యం

By

Published : Aug 3, 2019, 11:37 PM IST

జమ్ముకశ్మీర్​లో నియంత్రణ రేఖ సమీపంలోని కెరాన్​ సెక్టార్​లో పాక్​ చొరబాటుదారులపై భారత్​ విరుచుకుపడింది. భారత్​లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఉగ్రవాదులు, పాక్ సరిహద్దు కార్యాచరణ బృంద సభ్యులను మట్టుబెట్టినట్లు ఆర్మీ ప్రకటించింది.

"కెరాన్​ సెక్టార్​లోని ఎల్​ఓసీ సమీపంలో పాకిస్థాన్​ సరిహద్దు కార్యాచరణ బృందం(బ్యాట్​) చొరబాటుకు ప్రయత్నించింది. వారిని మేం అడ్డుకుని మట్టుబెట్టాం. ఈ దాడిలో 5 నుంచి 7 మంది చనిపోయి ఉంటారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్న కారణంగా వారిని గుర్తించలేకపోయాం."

-కల్నల్​ రాజేశ్ కాలియా, భద్రతా దళాల అధికారి

జులై 31 నుంచి ఆగస్టు 1 మధ్యలో ఈ చొరబాటుకు పాక్​ బ్యాట్​ ప్రయత్నించినట్లు సైన్యం పేర్కొంది. ఇందులో నలుగురి మృతదేహాలు భారత ఔట్​ పోస్టులకు సమీపంలోనే ఉన్నాయి. వీటిని స్వాధీనం చేసుకునేందుకు చేస్తోన్న ప్రయత్నాలకు పాక్​ బలగాలు అంతరాయం కలిగిస్తున్నాయని కల్నల్​ తెలిపారు.

గడిచిన 36 గంటల్లో లోయలో శాంతికి భంగం కలిగించేందుకు పాకిస్థాన్​ లెక్కకు మించి ప్రయత్నించిందని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'ఆపరేషన్​ కశ్మీర్'పై నిఘా వర్గాల సమాచారం ఇదే!

ABOUT THE AUTHOR

...view details