కొన్ని రోజులుగా నియంత్రణ రేఖ వెంబడి ఉన్న లాంచ్ పాడ్స్‌లో ఉగ్రవాదుల సంఖ్యను పాకిస్థాన్ పెంచుతోందని భారత సైన్యం వెల్లడించింది. చొరబాటుదారులనూ పాక్ ప్రోత్సహిస్తోందని చెప్పారు నార్తర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెప్టినెంట్ జనరల్ రణ్‌బీర్ సింగ్.
ఇలాంటి చర్యలను కొనసాగిస్తే పాకిస్థాన్‌ను కోలుకోలేని విధంగా భారత సైన్యం దెబ్బతీస్తుందని హెచ్చరించారు రణ్‌బీర్. ఎన్నో సందర్భాల్లో పాకిస్థాన్‌కు భారత్ దీటుగా సమాధానమిచ్చిందని.. ఇప్పుడూ అందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.