మయన్మార్‌తో సైనిక సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం. నరవాణే ఆదివారం ఆ పొరుగు దేశాన్ని సందర్శించనున్నారు. ఆయన రెండు రోజుల పర్యటనలో ఉగ్రవాద మూకలకు వ్యతిరేకంగా వ్యూహాలు రచించడం, ఇరు దేశాల ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పనిచేయడం వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్వర్ధన్ ష్రింగ్లా కూడా ఆయన వెంట వెళ్లనున్నారు.
రెండు రోజుల మయన్మార్ పర్యటనకు ఆర్మీ చీఫ్
భారత సైన్యాధిపతి జనరల్ ఎంఎం. నరవాణే ఆదివారం నుంచి 2 రోజుల పాటు మయన్మార్‌లో పర్యటించనున్నారు. విదేశాంగ కార్యదర్శి హర్ష్వర్ధన్ ష్రింగ్లా కూడా ఆయనతో పాటు వెళ్లనున్నారు.
ఆర్మీ చీఫ్ మయన్మార్ పర్యటన రేపే
మార్చిలో కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత నరవాణేకుఇదే తొలి విదేశీ పర్యటన. ఇందులో భాగంగా.. మయన్మార్ అగ్ర నాయకులు సహా ఆ దేశ కౌన్సిలర్ ఆంగ్ సాన్ సూకీలను భారత ఆర్మీ చీఫ్ కలిసే సూచనలున్నాయని సమాచారం.
ఇదీ చదవండి: రాహుల్ హాథ్రస్ పర్యటన అడ్డుకునేందుకు యోగి వ్యూహం