తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నవంబర్​ తొలి వారంలో నేపాల్​కు ఆర్మీ చీఫ్ - ARMY CHIEF

భారత సైన్యాధిపతి ఎంఎం నరవాణే నేపాల్​లో పర్యటించనున్నారు. నవంబర్​ తొలి వారంలో వెళ్లనున్నట్లు ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు. నేపాల్​ రక్షణ మంత్రి ఈశ్వర్​ పోఖ్రెల్​, ఆర్మీ చీఫ్​ పూర్ణ చంద్ర థాపాతో కీలక చర్చలు జరపనున్నట్లు అధికారులు తెలిపారు.

Army Chief Gen MM Naravane to visit Nepal early next month
నవంబర్​ తొలి వారంలో ఆర్మీ చీఫ్​ నేపాల్​ పర్యటన

By

Published : Oct 15, 2020, 5:44 AM IST

భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే వచ్చే నెల నేపాల్‌లో పర్యటించనున్నారు. అక్కడి ఆర్మీ ఉన్నతాధికారులతో కీలక చర్చలు జరపనున్నట్లు సైన్యాధికారులు ప్రకటించారు. రక్షణ మంత్రి ఈశ్వర్​ పోఖ్రెల్​, నేపాల్​ ఆర్మీ చీఫ్​ పూర్ణ చంద్ర థాపాతోనూ భేటీ కానున్నారు.

భారత భూభాగాలను తనవిగా చెప్పుకుంటూ కొత్త మ్యాప్‌ను నేపాల్ ఆమోదించిన తర్వాత.. ఆ దేశానికి నరవాణే వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌లోని కాలాపానీ, లింపియాధురా, లిపులేఖ్‌ భూభాగాలను నేపాల్‌కు చెందినవిగా పేర్కొంటూ నేపాల్ కొత్త రాజకీయ మ్యాప్‌ను రూపొందించింది. ఈ మ్యాప్‌కు నేపాల్ పార్లమెంటు ఈ ఏడాది జూన్‌లో ఆమోదం తెలిపింది. నేపాల్ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇటువంటి కృత్రిమ ప్రాదేశిక విస్తరణలను ఆమోదించబోమని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ ఆ దేశంలో పర్యటించబోతున్నారు. నేపాల్ అధ్యక్షురాలు విద్యా దేవి భండారీ ఓ ప్రత్యేక కార్యక్రమంలో జనరల్ నరవాణేకు ‘జనరల్ ఆఫ్ నేపాలీ ఆర్మీ గౌరవ ర్యాంకును ప్రదానం చేస్తారు.

ఇవీ చూడండి:భారత్​పై నేపాల్​కు ఎందుకంత అక్కసు?

భారత్​-నేపాల్​ మధ్య ఉన్నత స్థాయి చర్చలు

ABOUT THE AUTHOR

...view details