జీశాట్-30 ఉపగ్రహాన్ని ఈ నెల 17న అంతరిక్షంలోకి పంపనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో వెల్లడించింది. ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఎరియాన్-5 వాహకనౌక ఈ ఉపగ్రహాన్ని మోసుకెళ్లనున్నట్లు ఇస్రో తెలిపింది. సమాచార శాటిలైట్ అయిన జీశాట్-30 బరువు సుమారు 3,357 కిలోలు. ఇన్‌శాట్-4ఏకు ప్రత్యామ్నాయంగా జీశాట్-30 పనిచేయనుంది.
భారత్‌తో పాటు అనుబంధ దేశాలకు ఈ ఉపగ్రహం ద్వారా కేయూ బ్యాండ్‌లో సిగ్నల్ అందిస్తారు. గల్ఫ్ దేశాలకు సీ బ్యాండ్ ద్వారా కవరేజ్ ఇవ్వనున్నారు. ఆసియాలో కొన్ని దేశాలతో పాటు ఆస్ట్రేలియాకూ సీ బ్యాండ్ ద్వారా సేవలు అందిస్తారు.