'ఎన్ఐఏ' తనిఖీల్లో ముగ్గురు అనుమానితులు అరెస్ట్ - SRI LANKA
శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్ల ఘటనతో సంబంధమున్నట్లు అనుమానిస్తున్న ముగ్గురిని తమిళనాడులోని పూణమల్లే నగరంలో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
శ్రీలంక బాంబు పేలుళ్లతో సంబంధమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులు పూణమల్లేకు దగ్గర్లోని గోల్డెన్ రెసిడెన్స్‌లో తలదాచుకున్నారు. ఈ విషయాన్ని చెన్నైలోని మన్నడి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులకు తెలిపారు. వెంటనే స్పందించిన ఎన్ఐఏ... అనుమానితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో పట్టుబడ్డ ముగ్గిరిపై ఎన్ఐఏ అధికారులు 4 గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విషయంపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది.