2018 బ్యాచ్ సివిల్ సర్వీసు అధికారులకు కేడర్ కేటాయింపులను రద్దు చేస్తూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించింది సుప్రీం. మే 17న వాదనలు వింటామని వెల్లడించింది.
ప్రస్తుత కేడర్లు అసంబద్ధంగా ఉన్నాయని, 2017లో జరిపిన విధంగా ఆన్లైన్లో కేడర్ కేటాయించాలని శిక్షణలో ఉన్న నలుగురు అధికారులు దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కేటాయింపులను న్యాయస్థానం రద్దు చేసింది. ఈ తీర్పును కేంద్రం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.