తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆడ్వాణీ సందేశం ఎవరిని లక్ష్యంగా చేసుకుంది' - భాజపా

భాజపా అగ్రనేత ఎల్​కే ఆడ్వాణీ ఇటీవల తన బ్లాగ్​లో చేసిన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏమిటో తెలపాలని శివసేన ప్రశ్నించింది. ప్రజాస్వామ్యానికి పండగ లాంటి ఎన్నిలను పారదర్శకంగా  నిర్వహించాలని ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఆడ్వాణీ వ్యాఖ్యానించారో తెలిపాలని సామ్నా పత్రికలో వ్యాసం ప్రచురించింది సేన.

'ఆడ్వాణీ సందేశం ఎవరిని లక్ష్యంగా చేసుకుంది'

By

Published : Apr 7, 2019, 12:40 AM IST

భాజపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ సీనియర్​ నేత ఆడ్వాణీ తన బ్లాగులో లేఖ ద్వారా ఇచ్చిన సందేశం ఎవరిని ఉద్దేశించిందో తెలపాలని శివసేన డిమాండ్ చేసింది. ఆడ్వాణీ సందేశంపై సామ్నా పత్రికలో వ్యాసాన్ని ప్రచురించింది.

వ్యతిరేక పార్టీలనుభాజపా ప్రత్యర్థులుగా మాత్రమే చూశామని, శత్రువులుగా, దేశద్రోహులుగా ఎన్నడూ పరిగణించలేదని ఆడ్వాణీ తన బ్లాగులో రాశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఉత్సవాలు లాంటివని, అవి నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా జరగాలని ఆడ్వాణీ వ్యాఖ్యానించారు. అయితే... ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలపాలని శివసేన ప్రశ్నించింది.

"లాల్​కృష్ణ ఆడ్వాణీ ఎట్టకేలకు మౌనం వీడారు. ఈసారి రచన ద్వారా మనోగతాన్ని వ్యక్తపరిచారు. 5 సంవత్సరాల సుదీర్ఘ కాలం అనంతరం బ్లాగులో సందేశమిచ్చారు. సందేశం ఆడ్వాణీ లాంటి సీనియర్​ నేతది కావడం వల్ల ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి, పురోగతి, ఆర్థిక పరమైన అంశాలు ప్రస్తావించకుండా, పాకిస్థాన్, దేశ భద్రత అంశాలనే ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. పుల్వామా ఉగ్రదాడుల అనంతరం జరిగిన వాయుసేన మెరుపుదాడులు వంటి పరిణామాలు దేశంలో మిగతా సమస్యలను వెనక్కినెట్టాయి. ఆడ్వాణీ సందేశం పరిశీలిస్తే, వాయుసేన దాడులకు ఆధారాలు డిమాండ్ చేసినంత మాత్రాన వారిని జాతి వ్యతిరేకులుగా భావించరాదని స్పష్టమవుతుంది. మోదీతో విభేదించే వారిని దేశాన్ని వ్యతిరేకించే వారిగా భాజపా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని ఆడ్వాణీ ఎవరిని లక్ష్యంగా చేసుకుని అన్నారు? "
-శివసేన 'సామ్నా' పత్రికలో కథనం

ABOUT THE AUTHOR

...view details