తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వేలంలో ప్రధాని పదవిని కొనుగోలు చేయలేరు' - భాజపా

ప్రధానమంత్రి అవ్వాలని బంగాల్​ ముఖ్యమంత్రి కలలు కంటున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. బంగాల్​లోని ఆసన్​సోల్​ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ... ప్రధాని పదవి 130 కోట్ల భారతీయుల ఆశీర్వాదమని వెల్లడించారు.

'వేలంలో ప్రధాని పదవిని కొనుగోలు చేయలేరు'

By

Published : Apr 23, 2019, 8:01 PM IST

బంగాల్​లోని ఆసన్​సోల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ... ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. మోసాలకు పాల్పడే వారికి ముఖ్యమంత్రులు సహకరిస్తుంటే, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారని తెలిపారు. తృణమూల్​ కాంగ్రెస్​ పాలనలో అవినీతి, మోసాలు నిరంతరం బంగాల్​ను కుదిపేస్తున్నాయని విమర్శించారు.

కుంభకోణాలు చేసిన సొమ్ముతో మమతా బెనర్జీ ప్రధాని పదవిని కొనుగోలు చేయడానికి కలలు కంటున్నారని ఆరోపించారు మోదీ.

మమతపై మోదీ ఆగ్రహం

"మన దీదీ... ప్రధానమంత్రి అవ్వాలని కలలు కంటున్నారు. వేలం పాటలో ప్రధాని పదవి లభిస్తే... కాంగ్రెస్​ పార్టీ, దీదీ.. దొంగలించిన సొమ్ములను వేలంలో పెడతారు. దీదీ... శారద, నారద కుంభకోణాల సొమ్ముతో కొనగోలు చేయడానికి ఈ ప్రధానమంత్రి పదవి వేలంలో లభించదు. 130 కోట్ల భారతీయలు ఆశీర్వాదాలు ఈ ప్రధాని పదవి."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతోనే మమత తనపై ఆరోపణలు, ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు మోదీ.

ఇదీ చూడండి: లారీ నిండా బాంబులు- శ్రీలంకలో హైఅలర్ట్​

ABOUT THE AUTHOR

...view details