తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లంకలో భారతీయుల 'కరోనా' వ్యధలు వినరా... - శ్రీలంక

కరోనా వైరస్​ కారణంగా భారత్​కు చెందిన 80 మంది శ్రీలంకలో చిక్కుకున్నారు. లాక్​డౌన్​ కారణంగా వారంతా స్వదేశానికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వాళ్లందరూ ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Anxiety escalating as finances dwindle, more than 80 Indians stuck in Sri Lanka
కరోనా ఎఫెక్ట్​: శ్రీలంకలో చిక్కుకున్న భారతీయులు.. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల పాలు

By

Published : Apr 14, 2020, 11:09 AM IST

లాక్​డౌన్​ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న తన భార్య మందులు లేక కుంగుబాటుకు లోనవుతోందని ఆందోళన చెందుతున్నాడు ఓ భర్త. స్వదేశానికి వస్తూ మార్గమధ్యలోనే చిక్కుకున్న వ్యాపారి కోసం వేయికళ్లతో ఎదురుచూస్తోంది మరో కుటుంబం. ఇలా ఒకరు, ఇద్దరు కాదు ఏకంగా 80 మంది భారతీయులు వివిధ పనులు నిమిత్తం శ్రీలంక చేరుకొని అక్కడ చిక్కుకున్నారు.

శ్రీలంకలో నిర్బంధంలో ఉన్న 80 మంది భారతీయుల కుటుంబ పరిస్థితులు దారుణంగా మారాయి. దాదాపు నెల రోజుల నుంచి అక్కడే ఉండటం వల్ల...ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిలో ఎక్కువ మంది హోటళ్లు, గెస్ట్​హౌస్​లు, స్నేహితుల ఇళ్లలో తలదాచుకున్నారు.

" గతేడాది డిసెంబరులో నేను ప్రయాణిస్తున్న ఓడను కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా హైజాక్​ చేశారు. మమల్ని ఐదు వారాల పాటు అందులోనే బంధించారు. దీని వల్ల నా భార్య డిప్రెషన్​లోకి వెళ్లిపోయింది. వైద్యుల సలహా మేరకు నా భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి మార్చి 7న కొలంబో చేరుకున్నా. మేము మార్చి 23న దుబాయ్​ వెళ్లి.. ఏప్రిల్​ 1న కలకత్తా వెళ్లాల్సి ఉంది కానీ కొలంబోలోనే చిక్కుకున్నాం. "

-- ప్రసాద్​, కొలంబోలో చిక్కుకున్న వ్యక్తి

మార్చి 20 నుంచి

మార్చి 20 నుంచి కొలంబోలో కర్ఫ్యూ విధించారు. అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిలిపేయడం వల్ల చాలా మంది భారతీయులు అక్కడే చిక్కుకున్నారు. సరైన ఆహార వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది అక్కడి రాయబార కార్యాలయానికి చేరుకున్నా ఫలితం లేకుండా పోయింది. మార్చి నాటికే 2,439 మంది భారతీయులు.. శ్రీలంకలో చిక్కుకున్నారు. అక్కడ ఉండిపోయిన పర్యాటకుల సంఖ్యా అధికమే. వీరితో పాటు 2,167 మంది చైనీయులు ఉన్నట్లు శ్రీలంక టూరిజం అండ్​ డెవలప్​మెంట్​ అథారిటీ తెలిపింది.

తినడానికి తిండి కూడా లేదు

కర్ఫ్యూ విధించిన నాటి నుంచి ఈనెల 3వ తేదీ వరకు చిక్కుకున్న వారికి కనీసం తిండి కూడా లేదు. చాలా మంది అక్కడ ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు, నిరాశతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఫలితంగా కేవలం హోటళ్ల గదులకే పరిమితమయ్యారు.

భార్యా పిల్లల ఎదురు చూపులు

కరోనా వల్ల నావికుడు సైతం ఇంటికి చేరుకోకపోవడం వల్ల అతని భార్య, ఆరేళ్ల కొడుకు, వృద్ధ తల్లిదండ్రులు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. వీరే కాకుండా వీదేశాల్లో చిక్కుకున్న ఎంతో మంది ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

విఫలమైన ప్రయత్నాలు

కొలంబోలోని భారత రాయబార కార్యాలయం నుంచి సాయం చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు అక్కడి అధికారులు. భారత్​లోనూ కట్టుదిట్టమైన లాక్​డౌన్​ అమలు వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. చాలా మంది వారి కుటుంబాలతో కలిసి పీఎంఓ, ఎంఈఏకు ట్వీట్​ చేశారు. అంతే కాకుండా ప్లకార్డులు, పోస్టర్లను పట్టుకున్న వీడియోలు, చిత్రాలను ఆన్​లైన్​లో ఉంచారు.

" నేను ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. బెంగళూరులో నా బిడ్డలు, వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు. నేను మార్చి 11 నుంచి ఇక్కడే చిక్కుకున్నా. దాదాపు నెల రోజుల పాటు నాకు సరైన ఆహారం లేదు. చాలా ఒత్తిడికి గురవుతున్నా."

-- సౌరభ్​ కుమార్​

మార్చి 5 నుంచి వివిధ వ్యాపార సంబంధిత పనులు కోసం శ్రీలంక వెళ్లిన చాలా మంది ఇదే దుస్థితిలో ఉన్నారు. సంజయ్​ మిశ్రా (47) కూడా ఇలాంటి ఇబ్బందులే పడుతున్నారు. బెంగళూరులో ఉన్న తన కుటుంబం కోసం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అతని భార్య, 75 ఏళ్ల అత్త మధుమేహంతో బాధపడుతున్నారు. అంతేకాకుండా ఈయన ఇద్దరు కుమార్తెల్లో ఒకరు మలేషియాలో చిక్కుకున్నారు.

ఇదీ చదవండి:కరోనా కాలంలో కొత్త భయం- ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు

ABOUT THE AUTHOR

...view details