దేశీయంగా రూపొందించిన జలంతర్గామి విధ్వంసక నౌక ఐఎన్ఎస్ కవరత్తిని నౌకాదళంలో ప్రవేశపెట్టారు భారత సైనిక దళాల ప్రధాన అధికారి జనరల్ ఎంఎం నరవణే. విశాఖపట్నంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న జనరల్ నవరణే... అధికారికంగా కవరత్తిని నౌకాదళానికి అప్పగించారు. ఈ సందర్భంగా నరవాణేకు గౌరవ వందనం చేసింది నౌకాదళం.
నౌకాదళంలో చేరిన 'ఐఎన్ఎస్ కవరత్తి' యుద్ధనౌక
యాంటీ సబ్‌మరైన్ యుద్ధ నౌక 'ఐఎన్ఎస్ కవరత్తి'ని నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ఈ మేరకు విశాఖపట్నంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భారత సైనిక దళాల ప్రధాన అధికారి జనరల్ ఎంఎం నరవాణే ప్రవేశపెట్టారు.
నౌకాదళానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్ ఈ నౌకకు రూపకల్పన చేయగా.. కోల్‌కతాకు చెందిన గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ సంస్థ తయారు చేసింది. సముద్ర అంతర్భాగంలో ప్రయాణించే జలాంతర్గాములను నాశనం చేసే సామర్థ్యం దీని సొంతం. 90శాతం నౌక దేశీయ పరిజ్ఞానంతో రూపొందింది. ఆన్ బోర్డ్ లోని అన్ని వ్యవస్థలపై సముద్ర పరీక్షలు పూర్తిచేసిన తర్వాతే అధికారులు నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. కవరత్తి రాకతో భారత నౌకాదళం సామర్థ్యం మరింత పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. జలాంతర్గామి విధ్వంసక సామర్ధ్యంతో పాటు స్వీయరక్షణ సామర్థ్యాన్ని కూడా ఐఎన్ఎస్ కవరత్తి కలిగి ఉంది.