తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యోగీ 'ప్రతీకార' చర్యలపై సుప్రీంలో వ్యాజ్యం - సుప్రీంకోర్టు

పౌర అల్లర్ల నేపథ్యంలో ధ్వంసమైన ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి నష్ట పరిహారాన్ని నిరసనకారుల నుంచే రాబట్టాలనుకున్న ఉత్రరప్రదేశ్​ ప్రభుత్వానికి చుక్కెదురయ్యే అవకాశముంది. ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వం జారీ చేసిన నోటీసులను వెంటనే రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలైంది. రాజకీయ ప్రత్యర్థులు, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశముందని పిటిషనర్​ పేర్కొన్నారు.

Anti-CAA protests in UP: Plea in SC seeks quashing of notices for recovering damages
యోగీ 'ప్రతీకార' చర్యలపై సుప్రీంలో వ్యాజ్యం

By

Published : Jan 25, 2020, 11:14 AM IST

Updated : Feb 18, 2020, 8:28 AM IST

పౌర అల్లర్ల నేపథ్యంలో ధ్వంసమైన ప్రభుత్వ ఆస్తులకు సమానమైన పరిహారాన్ని చెల్లించాలంటూ ఇటీవలే ఉత్తరప్రదేశ్​ జిల్లా యంత్రాంగం నిరసనకారులకు నోటీసులు జారీ చేసింది. తాజాగా ఈ నోటీసులను తక్షణమే రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలైంది.

నిరసనల పేరుతో.. ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తూ, ఆరేళ్ల క్రితం మరణించిన వ్యక్తులకు కూడా నోటీసులు జారీ చేశారని పిటిషన్​లో పేర్కొన్నారు న్యాయవాది పర్వైజ్​ ఆరిఫ్​. ఎలాంటి ఎఫ్​ఐఆర్ దాఖలు కాని.. నేర చరిత్రలు లేని​ వారికీ నోటీసులు జారీ చేశారని ఆరోపించారు.

2010 అలహాబాద్​ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ నోటీసులు జారీ చేశారని... కానీ ఈ తీర్పు 2009లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గనిర్దేశకాలను ఉల్లంఘిస్తోందని పిటిషన్​లో పేర్కొన్నారు పర్వైజ్​.

హైకోర్టుల్లో నిందితులుగా ఉన్న వారి నుంచి మాత్రమే పరిహారాన్ని వసూలు చేయాలని 2009లో అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే.. ఈ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్నానికి అప్పగిస్తూ.. 2010లో అలహాబాద్​ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు సుప్రీం ఆదేశాలను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు పిటిషనర్​ తరఫు న్యాయవాది.

ఇలాంటి చర్యలతో తమ రాజకీయ ప్రత్యర్థులు, మైనారిటీలను ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్​ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకునే అవకాశముందని వ్యాజ్యంలో పేర్కొన్నారు పర్వైజ్​. అందువల్ల నోటీసులను రద్దు చేసే విధంగా ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

ఇదీ చూడండి:- నితిన్​ గడ్కరీ బౌలింగ్​లో.. హార్దిక్​ పాండ్య సిక్సర్​

Last Updated : Feb 18, 2020, 8:28 AM IST

ABOUT THE AUTHOR

...view details