పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక నిరసనలతో దిల్లీలో మరోమారు ఉద్రిక్త వాతావరణ నెలకొంది. జఫ్రాబాద్‌లో శనివారం రాత్రి ప్రారంభమైన పౌర ఆందోళనలు.. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జఫ్రాబాద్ మెట్రో స్టేషన్ వద్ద భారీగా బలగాలను మోహరించారు అధికారులు. ముందు జాగ్రత్తగా మెట్రో స్టేషన్ గేట్లను ముసివేశారు.
రాజధానిలో ఆగని నిరసనలు.. జఫ్రాబాద్‌లో ఉద్రిక్తత - దిల్లీ పౌర నిరసనలు
దేశ రాజధానిలో సీఏఏ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా శనివారం రాత్రి నుంచి జఫ్రాబాద్ వద్ద మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జఫ్రాబాద్ మెట్రోస్టేషన్ గేట్లను మూసివేసిన అధికారులు.. భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు.
రాజధానిలో ఆగని నిరసనలు.. జఫ్రాబాద్‌లో ఉద్రిక్తత
సీఏఏకు వ్యతిరేకంగా శనివారం రాత్రి మహిళలు భారీ సంఖ్యలో జఫ్రాబాద్‌కు చేరుకున్నారు. ఫలితంగా సీలంపుర్ రోడ్డు(మౌజ్‌పుర్-యమునా విహార్‌ను కలిపే రహదారి)లో రాకపోకలు నిలిచిపోయాయి. త్రివర్ణ పతాకాలను పట్టుకుని 'ఆజాదీ' నినాదాలు చేశారు. సీఏఏను రద్దు చేసేంతవరకు అక్కడి నుంచి కదలమని స్పష్టం చేశారు.
సీఏఏకు వ్యతిరేకంగా ఇప్పటికే దిల్లీలోని షహీన్‌బాగ్, ప్రధాన శీలంపుర్ రోడ్డులో నిరసనలు జరుగుతున్నాయి.
Last Updated : Mar 2, 2020, 7:00 AM IST