తెలంగాణ

telangana

By

Published : Dec 30, 2019, 9:34 AM IST

Updated : Dec 30, 2019, 10:08 AM IST

ETV Bharat / bharat

'పౌర' చట్టానికి వ్యతిరేకంగా రంగవల్లులతో డీఎంకే నిరసన

పౌరసత్వ సవరణ చట్టానికి తమిళనాడులో వినూత్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆదివారం ముగ్గులు వేసి కొంతమంది నిరనస తెలపగా తాజాగా ప్రతిపక్ష డీఎంకే అదే బాటలో నిరసన వ్యక్తం చేసింది. డీఎంకే అధినేత స్టాలిన్, కనిమొళి నివాసాల ముందు పౌరసత్వ చట్టం, ఎన్​ఆర్​సీలకు వ్యతిరేకంగా రంగవల్లులు వేశారు.

Anti-CAA-NRC kolams featured at doorsteps of Stalin, Kani
పౌర చట్టానికి వ్యతిరేకంగా డీఎంకే రంగవళ్లుల నిరసనలు

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా తమిళనాడులో ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. పౌర చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే వివిధ రూపాల్లో ఆందోళనలు చేసిన ప్రతిపక్ష డీఎంకే... తాజాగా వినూత్నరీతిలో ఇంటి ముందు ముగ్గులు వేసి నిరసన వ్యక్తం చేసింది. డీఎంకే అధినేత స్టాలిన్, కనిమొళి నివాసాల ముందు పౌర చట్టం, జాతీయ పౌర పట్టికలకు వ్యతిరేకంగా రంగవల్లులు వేసి నిరసన వ్యక్తం చేశారు. అంతేకాక కార్యకర్తలు సైతం ఇందులో పాల్గొనాలని డీఎంకే ఎంపీ కనిమొళి పిలుపునిచ్చారు.

'పౌర' చట్టానికి వ్యతిరేకంగా రంగవల్లులతో డీఎంకే నిరసన

పోలీసుల చర్యకు నిరసన

మరోవైపు పౌర చట్టం, ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా ముగ్గులు వేసి నిరసన వ్యక్తం చేసినందుకు ఆదివారం ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని వదిలేశారు. పోలీసుల చర్యకు నిరసనగా మరింత మంది ఇదే బాటలో పయనించారు. ఆదివారం సాయంత్రం వరకు చాలా మంది ప్రజలు తమ ఇళ్ల ముందు సీఏఏ,ఎన్​సీఆర్​లకు వ్యతిరేకంగా ముగ్గులు వేశారు.

ఇదీ చదవండి: పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ముగ్గులు వేసినందుకు 8 మంది అరెస్టు

Last Updated : Dec 30, 2019, 10:08 AM IST

ABOUT THE AUTHOR

...view details