గాడిదలవారి వివాహమహోత్సవం!
ఏదో తూతూమంత్రంగా జరగలేదు ఈ గాడిదల పెళ్లి. హిందూ సంప్రదాయం ప్రకారం గాడిదలను పట్టు వస్త్రాలతో ముస్తాబు చేశారు. వేదిక వద్ద గాడిదల ఫొటోలతో ఫ్లెక్సీలు కట్టించారు.
గాడిదలవారి వివాహమహోత్సవం!
ఏదో తూతూమంత్రంగా జరగలేదు ఈ గాడిదల పెళ్లి. హిందూ సంప్రదాయం ప్రకారం గాడిదలను పట్టు వస్త్రాలతో ముస్తాబు చేశారు. వేదిక వద్ద గాడిదల ఫొటోలతో ఫ్లెక్సీలు కట్టించారు.
పెళ్లి కొడుకు, పెళ్లి కూతుళ్లను బాజా భజంత్రీలతో ఊరేగింపుగా సుబ్రమణ్య స్వామి ఆలయానికి తీసుకెళ్లారు. స్వామి వారి సాక్షిగా, వేదమంత్రాల నడుమ పెళ్లి చేశారు. వధువు గాడిదకు తాళి కట్టేందుకు.. వరుడు గాడిదకు గ్రామస్థులంతా సాయం చేశారు.
పెళ్లికొచ్చిన అతిథులంతా నవ వధూవరూలను దీవించారు. కట్నాలూ, కానుకలూ సమర్పించి కడుపారా వారి సంప్రదాయ కంబన్కుల్ను విందుగా స్వీకరించారు.
దేశంలోని అనేక ప్రాంతాలు వరదల్లో మునకలేస్తూంటే అన్నూరు మాత్రం వర్షాలు లేక ఎండిపోతోంది. తీవ్రమైన నీటి కొరతతో ప్రజలు సతమతమవుతున్నారు.
ఇదీ చూడండి:వైరల్: పోలీసునే పరుగులు పెట్టించిన మహిళ