కేదార్నాథ్, బద్రినాథ్ ఆలయ కమిటీ సభ్యుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ నియమితులయ్యారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
అంబానీకి పదవి - బద్రినాథ్ గుడి
కేదార్నాథ్, బద్రినాథ్ ఆలయ కమిటీ సభ్యుడిగా ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీని నియమించింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం.
![అంబానీకి పదవి](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2635782-998-73f64842-7cf9-4e58-a19e-a0f505473263.jpg)
అంబానీకి పదవి
తరచూ సందర్శన...
కుటుంబంలో ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం జరిగే ముందు అంబానీలంతా ఈ గుళ్లలో పూజలు చేస్తుంటారు. గత సంవత్సరం ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ పెళ్లికి ముందు కూడా ఈ ఆలయాలను సందర్శించారు.