తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రోడ్డు దాటుతూ.. రెండు కాళ్లూ కోల్పోయిన వృద్ధురాలు! - govt bus

చెన్నైలో రోడ్డు దాటేందుకు ప్రయత్నించి ఓ వృద్ధురాలు రెండు కాళ్లూ పోగొట్టుకుంది. సిగ్నల్​ దగ్గర బస్సు చక్రాల కింద పడిపోయిన ఆమెను స్థానికులు కాపాడారు. పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ప్రమాద దృశ్యాలు వైరల్​ అయ్యాయి.

రోడ్డు దాటబోయి రెండు కాళ్లూ కోల్పోయిన వృద్ధురాలు!

By

Published : Aug 11, 2019, 11:26 AM IST

Updated : Sep 26, 2019, 3:59 PM IST

రోడ్డు దాటబోయి రెండు కాళ్లూ కోల్పోయిన వృద్ధురాలు
తమిళనాడు చెన్నైలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ బస్సు వృద్ధురాలిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆమె రెండు కాళ్లూ పొగొట్టుకుంది.

చెన్నై పురసాయివక్కంలో ట్రాఫిక్​ సిగ్నల్ దగ్గర ఈ ఘటనజరిగింది. రెడ్​ సిగ్నల్​ పడిన సమయంలో వాహనాలన్నీ కాసేపు రోడ్డుపై ఆగాయి.​ జీబ్రా క్రాసింగ్​ పద్దతిని పాటించని వృద్ధురాలు బస్సు ముందు నుంచి రోడ్డు దాటే ప్రయత్నం చేసింది. ఎత్తులో ఉన్నందున బస్సు డ్రైవర్​కు మహిళ కనబడలేదు. గ్రీన్​ సిగ్నల్​ పడగానే బస్సును ముందుకు కదిపాడు. బస్సు తాకిడికి చక్రాల కింద పడిపోయిందామె. ఈ సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి.

స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె రెండు కాళ్లూ కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:డోభాల్​ను ప్రశ్నించిన కశ్మీర్​ గొర్రెల కాపరి

Last Updated : Sep 26, 2019, 3:59 PM IST

ABOUT THE AUTHOR

...view details