తమిళనాడులో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. తిరునల్వేలిలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ పసికందును పొదల్లో పడేసి వెళ్లిపోయారు. అరుపులు విన్న స్థానికులు... చిన్నారిని గుర్తించారు. వెంటనే ఆ ఆడ పిల్లను రక్షించి పోలీసులకు అప్పగించారు.
ముళ్ల పొదల్లో శిశువు- ఈ పాపం ఎవరిది..? - స్థానికులు
తమిళనాడులోని తిరునల్వేలిలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఓ శిశువును పొదల్లో పడేసిన ఘటన కలకల రేపింది. ఆ పసికందును గుర్తించి పోలీసులకు అప్పగించారు స్థానికులు. శిశువు క్షేమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
పొదల్లో శిశువు- ఈ పాపం ఎవరిది..?
వైద్య పరీక్షల కోసం పసికందును పాలయన్కొట్టయ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రస్తుతం శిశువు క్షేమంగా ఉందని తెలిపారు. పూర్తిస్థాయి చికిత్స అనంతరం బిడ్డను శిశు సంరక్షణ కేంద్రానికి తరలించనున్నట్టు వివరించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
ఇదీ చూడండి:- వృద్ధులే కదా అని దొంగతనానికొస్తే.. తరిమేస్తాం!
Last Updated : Sep 27, 2019, 12:00 PM IST